telugu navyamedia
రాజకీయ వార్తలు

గవర్నర్ లేఖను సుప్రీం కోర్టుకు సమర్పించిన సొలిసిటర్ జనరల్

Supreme Court

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది. గవర్నర్ నిర్ణయాన్ని తెలిపేముందు అసలేం జరిగిందో కోర్టుకు వివరిస్తానని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అన్ని పార్టీలను ఆహ్వానించారని, పార్టీలన్నీ విఫలమైన తర్వాతే రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేశారని సొలిసిటర్ జనరల్ వివరించారు.

గవర్నర్ కార్యదర్శి తరఫున వాదనలు వినిపిస్తున్నానని’ సొలిసిటర్ జనరల్ వెల్లడించారు. గవర్నర్ నిర్ణయంపై న్యాయసమీక్ష పరిధిని సొలిసిటర్ జనరల్ ప్రశ్నించారు. దీనిపై లోతైన విచారణ జరపాల్సిన అవసరం గవర్నర్ కు లేదని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఫడ్నవిస్ కు మహారాష్ట్ర గవర్నర్ కోష్యారీ ఇచ్చిన ఒరిజినల్ లేఖను సుప్రీంకోర్టుకు సొలిసిటర్ జనరల్ సమర్పించారు.

Related posts