telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఆర్ఆర్ఆర్” విడుదల వాయిదా… అధికారిక ప్రకటన

RRR

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌లలో “ఆర్ఆర్ఆర్” అనే భారీ బ‌డ్జెట్ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ 70 శాతం పూర్తైంద‌ని ఇటీవ‌ల మేక‌ర్స్ తెలిపారు. అయితే చిత్రంలో చ‌ర‌ణ్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా అలియా భ‌ట్‌, ఎన్టీఆర్‌కి జోడీగా ఓలివియా మోరిస్‌పై స‌నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చితాన్ని వచ్చే ఏడాది జూలై 30న విడుదల చేయబోతున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. భారీ బ‌డ్జెట్‌తో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్ష‌కుల‌లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. చిత్రానికి సంబంధించి ఇప్ప‌టి వ‌రకు ఒక్క లుక్ కూడా విడుద‌ల కాక‌పోవ‌డంతో సినిమాకి సంబంధించిన అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా గ‌మనిస్తున్నారు. అయితే ఈ చిత్రం విడుదల ఆలస్యం కావొచ్చు అంటూ వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ ఈ చిత్రాన్ని 2021, జనవరి 8న విడుదల చేస్తున్నట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా వచ్చే ఏడాదికి వాయిదా పడినట్లు ఈ తాజా ప్రకటన సూచిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాదికి మారడంతో నందమూరి, మెగా అభిమానులు నిరాశ చెందుతున్నారు.

Related posts