telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏపీలో చేత‌కాని ద‌ద్ధ‌మ్మ పాల‌న కొన‌సాగుతుంది- చంద్ర‌బాబు

*మ‌హ‌నాడు తెలుగుజాతికి ఒక పండుగ‌..
*చ‌రిత్ర ఉన్నంత వ‌ర‌కు టీడీపీ ఉంటుంది..
*ప్ర‌తీ కార్య‌క‌ర్త సిద్ధ‌మ‌వుతున్నారు.
*ఒక చేత‌కాని ద‌ద్ధ‌మ్మ పాల‌న కొన‌సాగుతుంది..
*మా కార్య‌క‌ర్త‌ల‌ను ఎంత‌గా ఇబ్బంది పెడితేఅంతగా రెచ్చిపోతారు..
*రాజ‌కీయం అంటే త‌మాషా కాదు..ఉన్మాది పాల‌న జ‌ర‌గుతోంది..
*జ‌గ‌న్ వ‌ల‌న రాష్ర్టం ప‌రువుపోతోంది..
*ప‌సుపు క‌ల‌ర్ చూస్తే చైత‌న్యం వ‌స్తుంది..
*రాష్ర్టంలో ఎక్క‌డ చూసినా బాదుడే బాదుడు..
*ఎవ‌రు త‌ప్పు చేసిన వ‌దిలి పెట్టం..ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పైనే మ‌న‌ పోరాటం..
*తాటాకు చ‌ప్ప‌ళ్ళు ఎవ‌రూ భ‌య‌ప‌డ‌రు..

ఏపీలో ఒక చేత‌కాని ద‌ద్ద‌మ్మ పాల‌న కొన‌సాగుతుంద‌ని టీడీపీ అదినేత చంద్ర‌బాబు అన్నారు.  ప్ర‌కాశం జిల్లా ఒంగోలులో టీడీపీ మ‌హానాడు ప్రారంభమైంది.

ఈ సంద‌ర్భంగా మహానాడులో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. టీడీపీ మహానాడు తెలుగుజాతికి పండుగ అని  చంద్రబాబు పేర్కొన్నారు. చరిత్ర ఉన్నంత వరకూ టీడీపీ ఉంటుందన్నారు. పసుపు రంగు చూస్తే చైతన్యం వస్తుందన్నారు.

చాలా దూర ద్రుష్టితో మన నాయకుడు పార్టీని రూపొందించారు. రైతు కోసం నాగలి. పేదవాడి కోసం గుడిసె, కార్మికుడి కోసం చక్రాన్ని తెలుగు దేశం లోగోలో చేర్చారు. అది ఎన్టీఆర్ ఆలోచనా విధానం. మూడేళ్లు మనం ఇబ్బందులు పడ్డాం. .అచ్చెన్నాయుడును అరెస్టు చేశారు. వేదికపై నుంచే నాయకుల్ని అరెస్టు అయ్యారు.

రాజకీయం అంటే తమాషా కాదన్నారు. రాష్ట్రంలో ఉన్మాది పాలన కొనసాగుతోందన్నారు.  జగన్ వల్ల రాష్ట్రం పరువు పోతోందన్నారు.గ‌త 40 ఏళ్ళ‌లో టీడీపీ ఎదుర్కొన్న ఇబ్బందులు ఒక ఎత్త‌యితే.. ఈ మూడేళ్ల‌లో వ‌చ్చిన ఇబ్బందులు ఒక ఎత్తు అని చంద్ర‌బాబు అన్నారు.

టీడీపీ కార్యకర్తలను ఎంతగా ఇబ్బంది పెడితే.. అంతగా రెచ్చిపోతారని అన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం పోరాడుతామ‌ని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా బాదుడే బాదుడు అన్నారు. వైసీపీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు. ఎవరు తప్పు చేసినా వదిలేది లేదు. ప్రజా సమస్యలపైనే మన పోరాటమ‌ని అన్నారు.

ఈరోజు వైసీపీలో ఉన్న నాయకులు కరడు గట్టిన నేరస్థులు. తప్పులు చెప్పి రాజకీయం చెప్పే వ్యక్తులు. ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా వారిని విరోధులుగా చూస్తున్నారు.’’ అని చంద్రబాబు అన్నారు.

Related posts