telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

ప్రభుత్వాస్పత్రికి వెళ్తే రోగం తగ్గుతుందనే భరోసా ప్రజలకు రావాలి: జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆస్పత్రుల్లో వైద్య సేవలపై ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని సూచించారు. కోవిడ్ నివారణ చర్యలపై సీఎం వైఎస్‌ జగన్‌ గురువారం తాడేపల్లి క్యాపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డబ్ల్యూహెచ్‌ఓ, జీఎంపీ ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన మందులు అందించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వాస్పత్రికి వెళ్తే రోగం తగ్గుతుందనే భరోసా ప్రజలకు రావాలని అధికారులకు తెలిపారు.

రాత్రి 11 గంటలనుంచి ఉదయం 6 గంటలవరూ కర్ఫ్యూ కొనసాగింపు జరగనుంది. కోవిడ్‌ పరిస్థితుల దృష్ట్యా పండుగల సీజన్‌లో జాగ్రత్తలు పాటించాలన్న సమావేశంలో పాల్గొన్నారు వైద్యులు.. వినాయకచవితి ఉత్సవాలను ఇళ్లకే పరిమితం చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్న వైద్యాధికారుల సిఫార్సు చేశారు. ఇళ్లల్లో విగ్రహాలు పెట్టుకునేందుకు అనుమతి ఇవ్వాలని, పబ్లిక్‌ స్థలాల్లో విగ్రహాలు వద్దని వైద్యాధికారుల సిఫార్సు.. నిమజ్జన ఊరేగింపులు వద్దని వైద్యాధికారుల సిఫార్సు చేశారు. ఈమేరకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశం ఇచ్చారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తప్పవన్న సీఎం.. ఈమేరకు మార్గదర్శకాలు వైద్య ఆరోగ్యశాఖ జారీచేయనున్నది.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపడా సిబ్బంది నియామకంపై సీఎం సమీక్షించారు. ఖాళీలు గుర్తించి 90 రోజుల్లోగా వారిని నియమించేందుకు తీసుకుంటున్న చర్యలపై సీఎం సమీక్ష జరిపారు. ఈ ప్రక్రియ పూర్తైన తర్వాత వైద్యులు లేరు, సిబ్బంది లేరనే మాటలు ఎక్కడా వినిపించకూడదన్నారు. నియామకాలు పూర్తైన తర్వాత డిప్యుటేషన్‌ అనే మాట వినిపించకూడదు. బయోమెట్రిక్‌తో పక్కాగా హాజరు, పనితీరుపై పర్యవేక్షణ ఉండాలన్నారు. ప్రజలకు వైద్య సేవలు అందడంలో ఎలాంటి ఇబ్బందుల రాకూడదు. ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ ద్వారా సమర్థవంతమైన సేవలు అందాలని సీఎం ఆదేశించారు. ఈమేరకు అధికారులు నిరంతర తనిఖీలు, పర్యవేక్షణ చేయాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, కోవిడ్ టాస్క్ ఫోర్స్ అధికారులు పాల్గొన్నారు.

Related posts