కరోనా సంక్షోభం నేపథ్యంలో దేశంలో ఇంధన ధరల పెంపు పరంపర కొనసాగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 17వ రోజు కూడా పెరిగాయి. పెట్రోలుపై లీటరుకు 20 పైసలు, డీజిల్‌పై లీటరుకు 55 పైసలు పెరిగాయి. గత 17 రోజుల్లో పెట్రోలు ధర లీటరుకి రూ.8.50, డీజిల్‌పై రూ.10.01 పెరగడం గమనార్హం.
గడిచిన రెండున్నర వారాల్లోనే దేశ రాజధాని లీటరు పెట్రోలు ధర రూ.79.76కి, డీజిల్ ధర రూ. 79.40కి చేరింది. రాష్ట్రాల పన్ను విధింపును బట్టి ఆయా రాష్ట్రాల్లో ధరల్లో తేడాలు ఉంటాయి. ధరలు పెంపుతో జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.