telugu navyamedia
క్రీడలు

సచిన్ టెండూల్కర్ రికార్డ్ బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ….

టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో 23,000 పరుగుల మైలురాయి పూర్తి చేసుకున్నాడు. 490 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించడం గమనార్హం. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ 522 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించాడు.

తర్వాత ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్‌ 544 మ్యాచ్‌ల్లో ఈ మైలురాయి చేరుకున్నాడు.దక్షిణాఫ్రికా ఆల్‌టౌమ్‌ ఆల్‌రౌండర్‌ జాక్వెస్‌ కలిస్‌ 551 మ్యాచ్‌ల్లో, శ్రీలంక మాజీ బ్యాట్స్‌మన్‌ కుమార సంగక్కర 568, రాహుల్‌ ద్రవిడ్‌ 576, మహేలా జయవర్దెనె 645 మ్యాచ్‌ల్లో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

IND Vs ENG 4th Test Day 1: Virat Kohli Breaks Sachin Record, Fastest Batsmen To Reach 23000 International Runs - Sakshi

ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి.. అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన మైలురాయిని క్రాస్‌ చేశాడు. జేమ్స్ అండర్సన్ వేసిన 18వ ఓవర్ చివరి బంతికి బౌండరీ బాదడంతో అంతర్జాతీయ క్రికెట్​లో 23వేల పరుగులను పూర్తిచేశాడు. అంతేకాదు 23వేల పరుగులు పూర్తిచేసిన ఫాస్టెస్ట్​ బ్యాట్స్​మన్​గా కోహ్లీ రికార్డుల్లోకెక్కాడు. కోహ్లీ ఇప్పటివరకు 440 మ్యాచ్‌ల్లో 490 ఇన్నింగ్స్‌లలో 23 వేల పరుగులు చేశాడు. అతని సగటు 55.28గా ఉంది. కోహ్లీ 70 సెంచరీలు మరియు 116 అర్ధ సెంచరీలు చేశాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 522 ఇన్నింగ్స్‌లలో 23వేల పరుగులు చేశాడు.

Kohli fastest to 23000 runs in international cricket | News9 Live

నాలుగో టెస్టు.. తొలి సెషన్‌: 54/3
నాలుగో టెస్టులో టీమిండియా తొలి రోజు తొలి సెషన్‌లో మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ(11), రాహుల్‌(17)తో పాటు వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ చెతేశ్వర్‌ పుజారా(4) తొందరగానే ఔటవ్వడంతో ఇబ్బందుల్లో పడింది.

ఇంగ్లాండ్‌ బౌలర్లు అండర్సన్‌, రాబిన్‌సన్‌, క్రిస్‌వోక్స్‌ చెరో వికెట్ తీశారు. తొలి సెషన్‌ ముగిసేసరికి టీమ్ఇండియా మూడు వికెట్లు కోల్పోయి 54 పరుగులు చేసింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(18), రవీంద్ర జడేజా(2) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్‌ పేసర్లు క్రిస్‌ వోక్స్‌, ఓలీ రాబిన్సన్‌, ఆండర్సన్‌ తలో వికెట్‌ పడగొట్టి టీమిండియాను కష్టాల్లోకి నెట్టారు.

Kohli fastest to 23,000 runs in international cricket | MorungExpress | morungexpress.com

అంత‌కు ముందు ఇంగ్లీష్ కెప్టెన్‌ జో రూట్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ఇంగ్లండ్ జ‌ట్టు రెండు మార్పులు చేసింది. వికెట్ కీపర్ జోస్ బ‌ట్ల‌ర్‌, ఆల్‌రౌండర్‌ సామ్ కరన్ స్థానంలో బ్యాట్స్‌మన్‌ ఒలీ పోప్‌, ఆల్‌రౌండర్‌ క్రిస్ వోక్స్ వ‌చ్చారు. మరోవైపు కెప్టెన్ విరాట్ కోహ్లీ భార‌త జ‌ట్టులో రెండు మార్పులు చేశాడు. సీనియర్ పేసర్లు ఇశాంత్ శ‌ర్మ‌, మొహ్మద్ ష‌మీ స్థానాల్లో ఆల్‌రౌండర్‌ శార్దూల్ ఠాకూర్‌, పేసర్ ఉమేశ్ యాద‌వ్‌లు జ‌ట్టులోకి వచ్చారు. దాంతో జట్టులో చోటు ఆశించిన తెలుగు క్రికెటర్ హనుమ విహారి, సీనియర్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు నిరాశే ఎదురైంది.

India vs New Zealand WTC Final Highlights: India 64/2 at stumps on Day 5, leading by 32 runs in the second innings | News9 Live

Related posts