telugu navyamedia
ఆంధ్ర వార్తలు

చంద్రబాబుతో మోహన్‌బాబు భేటీ..రెండు గంట‌ల‌పాటు ఏపీ రాజీయాల‌పై చ‌ర్చ‌లు ..

*హైద‌రాబాద్‌లోని చంద్ర‌బాబు ఇంటికి వెళ్ళిన మోహ‌న్‌బాబు..
*రెండు గంట‌ల‌పాటు ఏపీ రాజీయాల‌పై చ‌ర్చ‌లు ..
*2014లో బీజేపీకి స‌పోర్ట్ చేసిన మోహ‌న్‌బాబు..
*2019లో వైసీపీకి మ‌ద్ద‌తు ..

హైద‌రాబాద్‌లోని టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు తో సినీ నటుడు మోహ‌న్‌బాబు ఇంటికి వెళ్ళారు. దాదాపుగా రెండు గంటల పాటు సాగిన వీరి భేటిలో ఏపీ రాజ‌కీయాలుపై సుదీర్ఘంగా చ‌ర్చించిన‌ట్టు తెలుస్తోంది.సాయంత్రం 4 గంటలకు వెళ్లిన మోహన్ బాబు ఆరు గంటల వరకూ చంద్రబాబుతో చర్చించారు.

మోహన్ బాబుకు చంద్రబాబుతో అంత సన్నిహిత సంబంధాలు లేవు. గత ఎన్నికలకు ముందు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫీజు రీఎంబర్స్‌మెంట్ రాలేదని ధ‌ర్నా చేశారు. ఆ తర్వాత మోహన్ బాబు వైసీపీ కండువా కప్పుకున్నారు. టీడీపీకి వ్యతిరేకంగా విస్తృతంగా ప్రచారం కూడా చేశారు.

Mohan Babu Meets AP CM Chandrababu at Hyderabad

 వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోహన్ బాబు తనకు రాజ్యసభ పదవి వస్తుందని భావించారు. కనీసం తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ పదవి అయినా దక్కుతుందని ఆశించారు. కానీ వైసీపీ అధినేత మాత్రం మోహన్ బాబును పట్టించుకోలేదు. జగన్ కుటుంబంతో మోహన్ బాబుకు బంధుత్వం కూడా ఉంది.

అయితే జగన్ టాలీవుడ్ సినిమాపై పలు దఫాలు చర్చలు జరిపితే కనీసం తనను ఆహ్వానించలేదన్న కినుకతో మోహన్ బాబు ఉన్నట్లు సమచారం. చిరంజీవి, మహేష్ బాబు వంటి వారిని పిలిపించుకుని చర్చలు జరిపిన జగన్ తమ కుటుంబాన్ని అవమానించారని మోహన్ బాబు గట్టిగా భావిస్తున్నారు. ఇటీవల జరిగిన వైసీపీ ప్లీనరీకి కూడా మోహన్ బాబు హాజరు కాలేదు. 

ఇప్పటికే ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా వుంటానని ప్రకటించారు మోహన్ బాబు. ఇప్పుడు ఉన్నట్టుండి చంద్రబాబుతో భేటీ కావడం చూస్తుంటే.. మళ్లీ ఆయన క్రియాశీలక రాజకీయాల్లోకి రాబోతున్నారా అన్న చర్చ జరుగుతోంది.

ఇటీవ‌ల‌ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణ మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు ప్యానెల్‌కు మద్దతు తెలిపిన విష‌యం తెలిసిందే.తాజాగా చంద్రబాబుతో మోహన్‌బాబు భేటీపై రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది. 

 

Related posts