telugu navyamedia
ఆంధ్ర వార్తలు

హోంమంత్రి తానేటి వనిత ఇలాకాలో వైసీపీ రివ‌ర్స్..పోటీలో అభ్యర్థులు కూడా లేరు

మంత్రి తానేటి వనితకు సొంత నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురయింది. కొవ్వూరు అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో టీడీపీ మద్దతుదారులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హోంమంత్రి వనిత కనీసం అభ్యర్థుల్ని నిలబెట్టడంలో విఫలమయ్యారు.

ఎన్నికల బరిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు మాత్రమే ఉండటంతో అన్ని స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. అర్బన్ బ్యాంక్ పాలకమండలిలో మరోసారి తెలుగుదేశం పార్టీ మద్దతు దారులు ఆధిపత్యం ప్రదర్శించారు.

టీడీపీని ఓడించాలని ముందుగానే వైసీపీ శ్రేణులకు హోంమంత్రి సూచించారు. వైసీపీ హైకమాండ్ కూడా అర్బన్ బ్యాంక్ ఎన్నికల విషయంలో హోంమంత్రి కు ప్రత్యేకమైన సూచనలు చేశారు. ఆ ప్రకారం పార్టీ నేతలకు ఆమె దిశానిర్దేశం చేశారు. అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్‌సీపీ మద్దతుదారులే గెలవాలని ఆమె స్పష్టం చేశారు. అయితే హోంమంత్రిఅనుకున్నట్లుగా జరగలేదు. కనీసం వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థులు పోటీలో నిలబడలేదు.

టీడీపీ నేత మద్దిపట్ల శివరామకృష్ణను ప్రెసిడెంట్‌గా డైరెక్టర్లు ఎన్నుకున్నారు. వరుసగా ఐదోసారి బ్యాంక్ చైర్మన్‌గా శివరామకృష్ణ బాధ్యతలు చేపట్టారు.

టీడీపీ గెలుపుతో వైసీపీ నేతలపై మంత్రి వనిత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. కొవ్వూరు అర్బన్ ఎన్నికల వ్యవహారంపై వైసీపీ అధిష్టానం ఆరా తీస్తున్నట్లు తెలిసింది.ఎ న్నికలు ఏకగ్రీవం అయినందున.. చెల్లదని చెప్పి త్రీమాన్ కమిటీ ద్వారా ఎన్నికలు వాయిదా వేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లుగా ప్రచారంజరుగుతోంది. నిబంధనల ప్రకారం ఎన్నికలు జరగలేదని వైసీపీ ఆరోపణలు చేస్తోంది.

ప్రస్తుతం జిల్లా రిజిస్ట్రార్ ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కనీసం పోటీలో అభ్యర్థులను నిలబెట్టకపోవడంపై హోంమంత్రి వనిత వైఫల్యంం ఉందని హైకమాండ్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

Related posts