telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రైల్వే బాదుడు షురూ.. నేటి అర్ధరాత్రి నుండే.. కొత్త సంవత్సర బహుమతేమో..

special train between vijayawada to gudur

కేంద్ర ప్రభుత్వం రైల్వే ప్రయాణికులకు షాక్‌ ఇచ్చింది. రైలు చార్జీలను మంగళవారం అర్ధరాత్రి నుంచి పెంచుతున్నట్టు రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అన్ని తరగతుల ప్రయాణీకుల చార్జీలను స్వల్పంగా పెంచుతూ ఉత్తర్వులను జారీ చేసింది. ఆర్డినరీ, నాన్‌-ఏసీ రైళ్లలో కిలోమీటర్‌కు పైసా చొప్పున, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో కిలోమీటర్‌కు రెండు పైసలు చొప్పున చార్జీలను పెంచారు. ఏసీ క్లాస్‌కు కిలోమీటర్‌కు 4 పైసల చొప్పున చార్జీలను పెంచినట్టు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.

రైల్వే శాఖ ఐదేళ్ల నుంచి చార్జీలను పెంచని దృష్ట్యా ఇప్పుడు హేతుబద్ధీకరించామని వెల్లడించింది. చివరిసారిగా 2014-15లో రైలు చార్జీలను పెంచారు. చార్జీల పెంపుతో పాటు రైళ్లలో ప్రయాణీకుల వసతి, సౌకర్యాలను మెరుగుపరుస్తామని, కోచ్‌ల ఆధునీకరణ, స్టేషన్లలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామని రైల్వే మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

Related posts