పోలవరం ప్రాజెక్ట్ రివర్స్ టెండరింగ్ పై టీడీపీ నేతలు ఏపీ సర్కార్ పై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయమై సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ ట్విటర్ లో విమర్శలు గుప్పించారు. ‘అయ్యా, తుగ్లక్ ముఖ్యమంత్రిగారూ’ అంటూ వరుస ట్వీట్లు చేశారు. ‘ఎడమకాలు విరిగితే ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో కట్టు కట్టించినట్టుంది జగన్ తెలివి’ అని ఎద్దేవా చేశారు.
పోలవరం రివర్స్ టెండర్లలో తగ్గించి, ఎలక్ట్రిక్ బస్సుల్లో పదింతలు పెంచిన లాజిక్, రివర్స్ టెండర్ వెనకున్న అసలైన మేజిక్ ప్రజలకూ అర్థమైంది’ అని ఆరోపించారు.పోలవరం లాంటి బహుళార్థక సాధక ప్రాజెక్టును, కేవలం స్వప్రయోజనాల కోసం ఎటువంటి అనుభవంలేని కంపెనీకి అప్పగించడం తగదని, ఆ ప్రాజెక్టు ఉనికికే ప్రమాదం అని అభిప్రాయపడ్డారు.
కశ్మీర్ అమ్మాయిలకు లైన్ క్లియర్.. హరియాన సీఎం అనుచిత వ్యాఖ్యలు