telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ సర్కార్ కు గవర్నర్ షాక్.. కొత్త మున్సిపల్‌ బిల్లుకు బ్రేక్‌

CM KCR Meet Governor Narasinhan

ఈ నెల 18,19 తేదీల్లో తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశాలను నిర్వహించింది. ఈ సమావేశాల్లో 2019 కొత్త మున్సిపల్ చట్టం బిల్లును ఆమోదించారు. ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త మున్సిపల్ బిల్లును గవర్నర్ నరసింహాన్‌ తిప్పి పంపారు. కొత్త బిల్లులో కలెక్టర్లకు సర్వాధికారాలు కల్పించడంపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ విషయమై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గవర్నర్‌ బిల్లులో కొన్ని సవరణలు చేయాలని సూచించారు. కొన్ని అంశాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రానికి బిల్లు పంపాలని నిర్ణయించడమే కాకుండా దానిని రిజర్వ్‌లో ఉంచారు.విపక్షాల అభ్యంతరంపై గవర్నర్ ఈ నిర్ణయం తీసుకొన్నారని సమాచారం. గవర్నర్‌ సూచించిన సవరణలతో కేసీఆర్ సర్కార్ ఆర్డినెన్స్ జారీ చేయనుంది.

Related posts