telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

చంద్రబాబు పై స్పీకర్ తమ్మినేని ఫైర్..

chandrababu tdp ap

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. 2వ రోజు సమావేశాలు కూడా వాడివేడిగా సాగుతున్నాయి ఈరోజు స్పీకర్ కు చంద్రబాబుకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నిన్న పంట నష్టానికి సంబంధించిన అంశం మీద టిడిపి ప్రభుత్వం మీద ఫైర్ అయితే ఈరోజు టిడ్కో ఇళ్లకు సంబంధించిన అంశాల మీద అసెంబ్లీలో టీడీపీ ఫైర్ అయ్యింది. ఇదే అంశం మీద స్పీకర్ వైపు వేలెత్తి చూపిస్తూ చంద్రబాబు మాట్లాడారు. ఈ క్రమంలో స్పీకర్ చంద్రబాబు మీద తీవ్రంగా ఫైర్ అయినట్లు సమాచారం. మాట్లాడే పద్ధతి నేర్చుకోవాలంటే చంద్రబాబు స్పీకర్ హితవు పలికారు. సభను విపక్షం పదేపదే అడ్డుకోవడం మీద స్పీకర్ ఫైర్ అయ్యారు. సభాధ్యక్షుడునే బెదిరిస్తారా అంటూ స్పీకర్ చంద్రబాబు మీద ఫైర్ అయ్యారు. టీడీపీ సభ్యుల ప్రవర్తన మీద కూడా స్పీకర్ తమ్మినేని ఫైర్ అయ్యారు. మీశాపనార్ధాలకు భయపడేది లేదు అంటూ స్పీకర్ తమ్మినేని చంద్రబాబు మీద తీవ్రంగా ఫైరయ్యారు. నీ దగ్గర నీతులు నేర్చుకోవాల్సిన అవసరం లేదంటూ చంద్రబాబు మీద ఫైర్ అయ్యారు. మరి ఇది ఎన్త దూరం పోతుందో చూడాలి.

Related posts