మాజీ భార్యను వెక్కిరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వ్యక్తికి అబూధాబీ కోర్టు 20 వేల దిర్హామ్‌ల (రూ. 3 లక్షల 89 వేలు) జరిమానా విధించింది. కోర్టు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు తన సోషల్ మీడియా ఖాతాలో ‘ఈ కోతి నుంచి ఉపశమనం పొందాను.. ఆమె నరకానికి వెళ్లనీ’ అంటూ మాజీ భార్యను వెక్కిరిస్తూ పోస్ట్ పెట్టాడు. అంతేకాకుండా తన మాజీ భార్య వాట్సాప్‌కు అసభ్యకరమైన మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు పంపినట్టు కోర్టు చెబుతోంది. మాజీ భర్త వేధింపులను తట్టుకోలేక తాను కోర్టుకెక్కినట్టు బాధితురాలు కోర్టులో ఆవేదన వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా.. తన మాజీ భార్యకు అసభ్యకరమైన మెసేజ్‌లు చేయలేదంటూ నిందితుడు చెప్పుకొచ్చాడు. బాధితురాలు కోర్టుకు సాక్ష్యాలు కూడా సమర్పించడంతో.. కోర్టు నిందితుడికి జరిమానా విధించింది. నిందితుడు కింద కోర్టు తీర్పును సవాల్ చేస్తూ పై కోర్టుకు వెళ్లగా.. అక్కడ కూడా నిందితుడికి పరాభవం ఎదురైంది. జరిమానా చెల్లించాల్సిందేనంటూ పైకోర్టు కూడా తీర్పునివ్వడంతో నిందితుడు లబోదిబోమంటున్నాడు.
previous post
పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోను: చంద్రబాబు