telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

రీపోలింగ్ పెట్టాలంటూ ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు…

bjp trs cocngress

హైదరాబాద్ ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. ఈ ఎన్నికల్లో అన్ని పార్టీలు చాలా సీరియస్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే పార్టీలు ఎంత సీరియస్ గా తీసుకున్నా ప్రజలు అంత లైట్ గా తీసుకున్నారు. గతంలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో 46 శాతం పోలింగ్ నమోదు అయితే ఇప్పుడు నాలుగు దాటిన తర్వాత కూడా ఆ శాతం 30 శాతానికి మించలేదు. ఈ క్రమంలో లో ఈ ఓటింగ్ ఎవరికి లాభం కలిగించే ఉంది అనేది ఆసక్తికరంగా మారింది. అయితే కొన్ని చోట్ల బ్యాలెట్ పేపర్ మీద టీఆర్ఎస్ కు సంబంధించిన కారు గుర్తు ని హైలెట్ చేస్తూ దాని చుట్టూ ఒక గడి కొట్టినట్టు ముద్రించారు అని చెబుతూ బిజెపి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.. ఏఎస్ రావు నగర్ వార్డు 2 లో అలాగే గడ్డి అన్నారం వార్డు నెంబర్ 23 లో అలా హైలెట్ అయినట్లు ముద్రించడం తో బీజేపీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.. అయితే ఇది ఓటర్లను ప్రలోభ పెట్టే అంశంగా ఉండడంతో ఆ రెండు వార్డుల్లో ఎన్నికలను క్యాన్సిల్ చేసి మరల ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. చూడాలి మరి దీని పై ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుంది అనేది. 

Related posts