telugu navyamedia
ఆంధ్ర వార్తలు

రేపే “మహా నటుడు, ప్రజా నాయకుడు-ఎన్ .టి .ఆర్” పుస్తకావిష్కరణ .

నందమూరి తారక రామారావు శత జయంతి ప్రారంభం సందర్భగా రేపు హైదరాబాద్ లో సీనియర్ జర్నలిస్ట్ రచించిన ” మహా నటుడు, ప్రజా నాయకుడు , ఎన్ .టి .ఆర్ పుస్తకావిష్కరణ జరుగుతుంది .

జర్నలిస్టుగా ఎన్ .టి .ఆర్ తో భగీరథ కు రెండు దశాబ్దాల పరిచయం వుంది . ఎన్ .టి ఆర్ తో భగీరథ చేసిన ఇంటర్వ్యూ లు , నటుడుగా ఆయన పోషించిన పాత్రలు , ఎదుర్కొన్న సంఘటనలు , సామాజిక సేవ, ముఖ్యమంత్రిగా ఆయన ప్రజలకు చేసిన చిరస్మరణీయమైన సేవలను గురించి భగీరథ ఈ పుస్తకంలో వ్రాశారు

శనివారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ ఫిలిం నగర్ చౌరస్తాలో ” మహా నటుడు, ప్రజా నాయకుడు , ఎన్ .టి .ఆర్ పుస్తకావిష్కరణ జరుగుతుంది . ఎన్ .టి .ఆర్ కుటుంబ సభ్యులు , సినిమా ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొంటున్నారు

Related posts