telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ : … ఆర్టీసీ సమ్మె మొదలు.. ఎక్కడ ఉన్నవారిని అక్కడే అరెస్టులు..

rtc protest started with arrest

ఆర్టీసీ కార్మిక సంఘాలతో త్రిసభ్య కమిటీ జరిపిన చర్చలు విఫలం కావడంతో కార్మికులు సమ్మెదిగారు. ఇలా ఆర్టీసీ సమ్మెకు దిగడం దాదాపు నాలుగేళ్ల తరువాత ఇదే. శుక్రవారం అర్థరాత్రి నుంచే కార్మికులు సమ్మెకు దిగారు. దూరప్రాంతాలకు వెళ్లే సర్వీసుల సిబ్బంది ముందుగానే విధులకు హాజరుకావడం మానేశారు. ఈసారి కార్మికులు తమ జీతాల కోసమో, ఇంక్రిమెంట్ల కోసమో సమ్మె చేయడం లేదు. సంస్థను కాపాడాలని సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వంలో విలీనం చేయమని అడుగుతున్నారు. కార్మికులు ఎంతో ముందుగానే సమ్మె నోటీసు ఇచ్చినా చివరి నిమిషం వరకూ చర్చలంటూ గడిపిన ప్రభుత్వం ఇప్పుడు ఎలాగైనా బస్సులు నడిపించి సమ్మెను విఫలం చేయాలని భావిస్తోంది. అందుకే ఎక్కడికక్కడ పోలీసుల భద్రతతో బస్సులు నడిపించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే కార్మికులను అరెస్టు చేస్తోంది.

శనివారం ఉదయమే ఆర్టీసీ కార్మికులు డిపోల ముందు కూర్చుని తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ సమ్మె కారణంగా జూబ్లీ బస్‌ స్టేషన్‌లో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సమ్మె కారణంగా హైదరాబ్ లో సిటీ బస్సులూ డిపోల్లోనే నిలిచిపోయాయి. కార్మికులు డిపో ముందే బైఠాయించి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ నినాదాలు చేశారు. దిల్‌సుఖ్‌ నగర్‌ డిపోలో 110 సిటీ బస్బులు నిలిచిపోయాయి. వరంగల్‌ రీజియన్‌ పరిధిలో తొమ్మిది డిపోలలోని 972 ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మహుబూబాబాద్‌ బస్టాండ్‌ ముందు ధర్నా నిర్వహిస్తున్న పది మంది ఆర్టీసీ కార్మికులను పోలీసులు ఆరెస్ట్‌ చేశారు. నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆరు డిపోల పరిధిలో సమ్మె ప్రభావంతో 670 ఆర్టీసీ, 182 అద్దె బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో 10 డిపోలలో 909 ఆర్టీసీ, 209 అద్దె బస్సులు నిలిచిపోయాయి. మహబూబ్‌ నగర్‌ ఉమ్మడి జిల్లాలోని 9 డిపోల పరిధిలో 880 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.

Related posts