telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారు నటించిన “బొబ్బిలిపులి”‘ చిత్రం నేటికీ 42 సంవత్సరాలు

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారు నటించిన విజయమాధవి కంబైన్స్ వారి”‘బొబ్బిలిపులి”‘ చిత్రం 1982 జూలై 9 వ తేదీన (09-07-1982) విడుదలయ్యింది.

దక్షిణభారత చలనచిత్ర చరిత్రలో అత్యధిక ప్రింట్లతో, అత్యధిక ధియేటర్లలో విడుదలైన తొలి చిత్రం ఎన్టీఆర్ గారి “‘బొబ్బిలిపులి.”‘  నిర్మాత వడ్డే రమేష్ విజయమాధవి కంబైన్స్ పతాకంపై దర్శకరత్న దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రానికి కథ,మాటలు, స్క్రీన్ ప్లే,: దాసరి నారాయణరావు, పాటలు: వేటూరి సుందర రామమూర్తి, దాసరి నారాయణరావు, సంగీతం: జె.వి.రాఘవులు, ఫోటోగ్రఫీ: కె.ఎస్.మణి, కళ: భాస్కరరాజు, నృత్యం: సలీం, కూర్పు: జి.జి.కృష్ణారావు, అందించారు.

ఈ చిత్రంలో ఎన్.టి.రామారావు, శ్రీదేవి, జయచిత్ర, అంబిక, మురళీమోహన్, సత్యనారాయణ, జగ్గయ్య, రావుగోపాలరావు, ప్రభాకరరెడ్డి, ప్రసాద్ బాబు, జ్యోతిలక్ష్మి, జయమాలిని, సుభాషిణి, విజయలలిత, ముక్కామల, అల్లూరి రామలింగయ్య, మిక్కిలినేని, రాజనాల, ధూళిపాళ, తదితరులు నటించారు.

సంగీత దర్శకుడు జె.వి. రాఘవులు గారు స్వరపరచిన బాణీలు ప్రేక్షకులనుఆకట్టుకున్నాయి.
“అది ఒకటో నెంబరు బస్సు”
“ఎడ్డమంటె తెడ్డమంటే”
“జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరి అసే”
“తెల్లచీరలో ఎన్నిసిగ్గులో”
“సంభవం నీకే సంభవం”
“ఓ సుబ్బారావు.. ఓ అప్పారావు..”
వంటి పాటలు సూపర్ హిట్ అయ్యాయి.

ఈ సినిమా సెన్సార్ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొనవలసి వచ్చింది. ఆ సమయంలో ఎన్టీఆర్ గారు రాజకీయ రంగప్రవేశం చేయటం, కొత్తగా “తెలుగుదేశం'”పార్టీని స్థాపించటంతో ఈ సినిమాకు సెన్సార్ వాళ్ళు అభ్యంతరం తెలిపారు. ఆపిదప ఎన్టీఆర్ అభిమాన సంఘాలు ధర్నాలు, నిరాహారదీక్షలు జరిపి పోరాటం చేయగా, చివరకు ఢిల్లీ సెన్సార్ బోర్డ్ అనుమతి లభించటంతో “బొబ్బిలి పులి” సినిమా జూలై 9 న విడుదలై సూపర్, డూపర్ హిట్ అయి రికార్డ్ సృష్టించింది.

ఈ చిత్రం మొదటి రోజు 13 లక్షల 22వేల 014 రూపాయలు వసూలు చేసింది. మొదటి వారం 71,60,408 రూపాయలు వసూలు చేసి సౌత్ ఇండియా రికార్డ్ క్రియేట్ చేసింది.

దక్షిణ భారత చలనచిత్ర చరిత్రలోతొలిసారిగా 100కు పైగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఘనవిజయం సాధించి విడుదలైన అన్ని కేంద్రాల్లో 50 రోజులు, 39 కేంద్రాలలో 100 రోజులు, 2 కేంద్రాలలో 175 రోజులు, (హైదరాబాద్ — సుదర్శన్ 35MM , విజయవాడ – వెంకటేశ్వర(షిఫ్ట్)లో  సిల్వర్ జూబ్లీ) ఆడింది.

ఒక కేంద్రం (హైదరాబాద్)లో 365 రోజులు (one year – గోల్డెన్ జూబ్లీ) మొత్తంగా ఒక కేంద్రం హైదరాబాద్ లో 371 రోజులు ప్రదర్శింపబడింది.

ఈ చిత్రం1993 లో రెండవ పర్యాయం విడుదలై హైదరాబాద్ లో 175 రోజులు ( సిల్వర్ జూబ్లీ) ఆడి రికార్డు సృష్టించింది…..

తెలుగు చలన చిత్ర చరిత్రలో మొదటి రన్,  రిపీట్ రన్ లలో 175 రోజులు ( సిల్వర్ జూబ్లీ) ఆడిన ఏకైక సినిమా “బొబ్బిలిపులి”….

Related posts