telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణ కరోనా అప్డేట్…

corona vairus

తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 3 లక్షలకు చేరుకున్నాయి. అయితే… ఇవాళ రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగింది. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 111 పాజిటివ్ కేసులు నమోదవగా…కరోనాతో ఒకరు మృతిచెందారు. ఇదే సమయంలో 189 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ఇక మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,00,011 కు చేరుకోగా.. 2,96,562 మంది రికవరీ అయ్యారు.. ఇక, ఇప్పటి వరకు 1,642 మంది మృతిచెందారు. దేశవ్యాప్తంగా కరోనా రికవరీ శాతం 96.9 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 98.85 శాతంగా ఉందని.. ప్రస్తుతం 1,807 యాక్టివ్‌ కేసులు ఉండగా.. అందులో 689 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. నిన్న ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా 19,929 శాంపిల్స్ టెస్ట్‌ చేశామని.. ఇప్పటి వరకు నిర్వహించిన టెస్ట్‌ల సంఖ్య 89,84,552 కు చేరిందని బులెటిన్‌లో పేర్కొన్నారు అధికారులు.

Related posts