telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రాష్ట్రంలో పీపీఈ కిట్లకు కొరత లేదు: మంత్రి ఈటల

Etala Rajender

రాష్ట్రంలో కరోనా భయం  తగ్గిందని తెలంగాణ వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 453 పాజిటివ్ కేసులు నమోదైనట్టు చెప్పారు. 45 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని, 11 మంది మృతి చెందారని తెలిపారు.

రాష్ట్రంలో ఇకపై పాజిటివ్ కేసులు నమోదు కాకపోవచ్చని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో పీపీఈ కిట్లకు కొరత లేదని, ఇప్పటికే 80 వేల కిట్లు ఉన్నాయని, మరో 5 లక్షల కిట్ల కోసం ఆర్డర్ ఇచ్చినట్టు తెలిపారు. అలాగే, ఎన్95 మాస్కులు లక్ష వరకు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.

ఢిల్లీలోని తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి వెళ్లి వచ్చిన 1100 మందికి పరీక్షలు నిర్వహించామని మంత్రి తెలిపారు. వారిని కలిసిన 3,158 మందిని గుర్తించి 167 క్వారంటైన్ కేంద్రాలకు తరలించినట్టు వివరించారు. ఇంకా 535 మందికి సంబంధించిన టెస్ట్ రిపోర్టులు రావాల్సి ఉందని మంత్రి పేర్కొన్నారు.

Related posts