telugu navyamedia
రాజకీయ వార్తలు

ఇక పెన్షనర్లకు .. ఆ బాధ ఉండదు..

pensioner submit documents in bank

ఇకమీదట ఉద్యోగిగా పదవీ విమరణ చేసిన వారు తమ లైఫ్ సర్టిఫికేట్ల కోసం ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. సీనియర్ సిటిజన్లు తమ లైఫ్ సర్టిఫికేట్‌ను బ్యాంకులో సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. దీంతో వారు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని తప్పింది. ఇదివరకు తమ కార్యాలయం, ఎస్టీవో ఆఫీసులో తమ ధ్రువీకరణ పత్రాలు అందజేసేవారు. వారు పడుతున్న ఇబ్బందులను గమనించి వారికి ప్రయోజనం కలిగించే నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం

పదవీ విరమణ చేసిన ఉద్యోగులు తమ ధ్రువీకరణ పత్రాలను బ్యాంకులో సమర్పిస్తే చాలని తెలిపింది. దాంతోపాటు ఆధార్ నంబర్ ఇస్తే సరిపోతుందని వెల్లడించింది. ఆధార్ తో మొబైల్ నంబర్ అనుసంధానం అవుతుందని వివరించింది. దీంతో వారి లైఫ్ సర్టిఫికెట్ వివరాలకు సంబంధించిన అంశాలు మొబైల్ కు ఓటీపీ వస్తోందని తెలిపింది. దీంతో మోసాలకు, చీటింగ్ కు ఆస్కారం కూడా ఉండదని … పెన్షనర్లకు నేరుగా లబ్ది చేకూరుతుందని వెల్లడించింది.

Related posts