కరోనా వైరస్ ప్రభావంతో బంగారం, వెండి ధరలు రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు క్రమంగా పెరిగిన విషయం తెలిసిందే. దీపావళి పండుగ అయిపోగానే బంగారం ధరలు దిగివచ్చాయి. దీపావళి కంటే ముందు బంగారం, వెండి ధరలకు రెక్కలు వచ్చాయి. కరోనా వైరస్ విజృంభించిన తర్వాత బంగారం ధరలు చుక్కలు చూపించిన ఇప్పుడు మళ్ళీ మార్కెట్ పుంజుకోవడంతో ధరలు తగ్గాయి. కానీ ఈరోజు ఢిల్లీలో బంగారం ధరలు స్థిరంగా ఉండగా హైదరాబాద్ లో మాత్రం పెరిగాయి. అయితే ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 10 తగ్గి రూ. 52,240 పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 10 తగ్గి రూ. 47,890 వద్ద ఉంది. హైదరాబాద్ విషయానికి వస్తే.. బంగారం ధరలు ఇవాళ స్థిరంగా రికార్డు అయ్యాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 330 తగ్గి రూ. 49,900కు చేరగా… అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 300 తగ్గి రూ. 45,750 పలుకుతోంది. అటు వెండి ధరలు మాత్రం ఎగిసిపడుతున్నాయి. అయితే వెండి అదే బాటలో నడిచింది. కిలో వెండి 600 తగ్గి రూ. 70,700 పలుకుతుంది.
previous post
next post