telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

త్వరలో నాని కొత్త సినిమా ప్రారంభం…

లాక్ డౌన్ తర్వాత టాలీవుడ్ హీరోలు జోరు పెంచారు. అంశారు వరుస సినిమాలను ప్రకటిస్తున్నారు. అందులో నాచురల్ స్టార్ నానీ కూడా ఉన్నాడు. అయితే నాని వీ అనుకున్నంతగా రాణించకపోయిన డీలా పడకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. నాని తాజా చిత్రం టక్ జగదీష్ విడుదలకు సిద్దమవుతోంది. ఈ సినిమాను ఏప్రిల్16న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ ఇప్పుడు ఈ సినిమా కాస్త ఆలస్యంగా వస్తుందని సమాచారం. ఈ సినిమా తరువాత నానీ చేస్తున్న సినిమా శ్యామ్ సింగరాయ్ ఈ సినిమా దాదాపు పూర్తయిపోయింది. త్వరలోనే శ్యామ్ సింగరాయ్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక నానీ తాజాగా నటిస్తున్న సినిమా అంటే సుందరానికి, పక్కా కామెడీ ఎంటర్‌టైనర్‌గా అలరించనున్నట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాని కామెడీ ప్యాక్‌గా చెప్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ అతి త్వరలో ప్రారంభం కానుంది. ఇందులో మలయాళీ బ్యూటీ నజ్రియా నాజిం హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాతోనే అందాల ముద్దుగుమ్మ నజ్రియా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది.

Related posts