డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్.. మరోసారి కీలక పాత్ర పోషించగలడని ఆస్ట్రేలియా లెజెండరీ స్పిన్ బౌలర్ బ్రాడ్ హాగ్ అంచనా వేశాడు. ఇంకా సుదర్ఘమైన కేరీర్ ఒక్క బౌలర్ అతనొక్కడే కనిపిస్తోన్నాడని ఆయన వ్యాఖ్యానించాడు. భవిష్యత్తులో అరుదైన రికార్డులను అతను నెలకొల్పగలడని చెప్పాడు. ముత్తయ్య మురళీధరన్ నెలకొల్పిన ఎవర్ గ్రీన్ రికార్డ్ 800 వికెట్ల మైలురాయిని అందుకునే శక్తి సామర్థ్యాలు రవిచంద్రన్ అశ్విన్‌కు మాత్రమే ఉన్నాయని అన్నాడు. అశ్విన్ వయస్సు 34 సంవత్సరాలే కావడం, ఇంకో ఎనిమిదేళ్లు తన కేరీర్‌ను కొనసాగించే అవకాశాలు ఉండటం 800 వికెట్ల రికార్డు అతనికి దాసోహం అంటుందనడంలో సందేహాలు అక్కర్లేదని బ్రాడ్ హాగ్ పేర్కొన్నాడు. 600లకు పైగా వికెట్లను అలవోకగా అందుకుంటాడని, ఆ తరువాత 800 మార్క్ చేరడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. తన కేరీర్‌లో రవిచంద్రన్ అశ్విన్ ఇంకా 42 టెస్ట్ మ్యాచ్‌లను ఆడటానికి అవకాశం ఉందని చెప్పాడు. ప్రస్తుతం టీమిండియా తరఫున టెస్టుల్లో అత్యథిక వికెట్లను పడగొట్టిన బౌలర్‌గా అనిల్ కుంబ్లే రికార్డ్ నెలకొల్పాడు. 132 టెస్ట్ మ్యాచ్‌లల్లో 619 వికెట్లను తీసుకున్నాడతను. ఆ తరువాత మాజీ కేప్టెన్ కపిల్ దేవ్ ఉన్నారు. 434 వికెట్లు పడగొట్టారా లెజెండరీ ఫాస్ట్ బౌలర్. మూడో స్థానంలో టర్బనేటర్ హర్భజన్ సింగ్ కొనసాగుతున్నాడు. అతని పేరు మీద 417 వికెట్లు ఉన్నాయి. నాలుగో స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ ఉన్నాడు. ఇప్పటిదాకా 409 వికెట్లను తీసుకున్నాడీ తమిళనాడు స్పిన్నర్.
previous post
next post