తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్‌రాజన్ ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా తిరుపతి చేరుకున్న గవర్నర్‌కు టీటీడీ ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ఆమెకు రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం పలికారు.
అనంతరం ఆలయ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈఓ ఎ.వి.ధర్మారెడ్డిలు గవర్నర్‌కు తీర్థప్రసాదాలు అందజేసి, స్వామి వారి చిత్రపటాన్ని బహూకరించారు. దర్శనానంతరం ఆలయం వెలుపల గవర్నర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. స్వామి వారి దర్శనంకు వచ్చే భక్తుల కోసం టీటీడీ ఏర్పాట్లు చాలా బాగున్నాయని కితాబిచ్చారు.