telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సాంకేతిక

వివో ఐక్యూ .. తో కొత్తదనానికి తెర..

vivo iq from vivo released

వివో మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్ ‘వివో ఐక్యూ’ ను తాజాగా మార్కెట్‌లో విడుదల చేసింది. ఇందులో అతిపెద్ద డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. అధునాతన ప్రాసెసర్‌, ర్యామ్‌లను ఈ మోడల్ లో అందుబాటులోకి తెచ్చారు. ట్రిపుల్ కెమెరాల తో పాటుగా, ఫ్రంట్ కెమెరాలతో ఈ మోడల్ ను విడుదల చేశారు. ఈ ఫోన్‌లో ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీ ఈ ఫోన్‌లో ఏర్పాటు చేశారు. దీనికి అల్ట్రా ఫాస్ట్ ఫ్లాష్ చార్జ్ ఫీచర్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఫోన్ బ్యాటరీ 0 నుంచి 50 శాతం చార్జింగ్ అయ్యేందుకు కేవలం 15 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. అలాగే 30 నిమిషాల్లో 85 శాతం చార్జింగ్, 45 నిమిషాల్లో 100 శాతం చార్జింగ్ పూర్తవుతుంది.

వివో ఐక్యూ ఫోన్ ఎలక్ట్రో ఆప్టిక్ బ్లూ, లావా ఆరెంజ్ రెడ్ కలర్ ఆప్షన్లలో విడుదల కాగా ఈ ఫోన్‌కు చెందిన 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్‌ను రూ.31,740 ధరకు విక్రయించనున్నారు. అలాగే ఈ ఫోన్‌కు చెందిన 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.34,910 ధరకు, 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.38,090 ధరకు, 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.45,500 ధరకు లభ్యం కానున్నాయి. ఈ ఫోన్లను మార్చి 6వ తేదీ నుంచి విక్రయిస్తారు. ప్రస్తుతం చైనాలో విడుదలైన ఈ మోడల్ అతి త్వరలో భారత్ లో కూడా విడుదల చేయనున్నారు.

వివో ఐక్యూ ఫీచర్లు :
6.41 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే
1080 × 2340 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్‌
6/8/12 జీబీ ర్యామ్‌, 128/256 జీబీ స్టోరేజ్‌
డ్యుయల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై
12, 13, 2 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 12 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌
డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైపై, బ్లూటూత్ 5.0
యూఎస్‌బీ టైప్ సి, ఎన్ఎఫ్‌సీ
4000 ఎంఏహెచ్ బ్యాటరీ, అల్ట్రా ఫాస్ట్ చార్జింగ్‌.

Related posts