టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న ఐదేళ్ల సమయంలో రూ.ఆరు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని వైసిపి ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి ఆరోపించారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు అనేక కుంభకోణాలకు పాల్పడ్డారని వ్యాఖ్యానించారు. కాగ్‌తో సహా చాలా సంస్థలు ఆయన అవినీతి, తప్పులను ఎత్తిచూపాయని తెలిపారు. రాజధాని, పిపిఎలలో అక్రమాలకు పాల్పడ్డారని, పోలవరం ప్రాజెక్టులో తనయునితో కలిసి కమీషన్ల కోసం అక్రమాలు చేశారని ఆరోపించారు.
అవినీతిలో కూరుకుపోయిన చంద్రబాబుకు జగన్‌ను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి అటు రైతులను ఇటు డ్వాక్రా మహిళలను చంద్రబాబు మోసం చేశారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు తెచ్చిన రూ.3.56లక్షల కోట్ల అప్పులు ఏమయ్యాయో తెలియడం లేదన్నారు. కరకట్టపై ఉన్న ఇల్లు తనకు వారసత్వంగా వచ్చిందా అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను జగన్ నేరవేరుస్తూ అందరికీ మేలు చేస్తున్నారని తెలిపారు.. బాబుకు ఏం విమర్శించాలో అర్ధం కాక పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై వాస్తవాలను దాచే ప్రయత్నం: భట్టి