వైఎస్ ఆర్ సిపి నగరి ఎమ్మెల్యే ఆర్.కె.రోజా డాక్టర్ అవ్వలన్న కోరిక తీరిందట. చిన్నతనంలో కుటుంబ సభ్యులు ఆమెను డాక్టర్ చేయడానికి ప్రయత్నించారట.. అందుకు తగ్గట్టుగా చదువు కూడా కొనసాగించింది. అయితే ఆమె అనూహ్యంగా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వంతో డాక్టర్ అవ్వకుండా యాక్టర్ మాత్రం అయిపోయింది.
చిత్తూరు జిల్లా లోని పుత్తూరు మండలం కేబీఆర్‌పురంలో ఆదివారం సుభాషిణి ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్యశిబిరాన్ని రోజా ప్రారంభించారు. ఈ క్రమంలో రోజా మెడలో స్టెతస్కోప్ వేసుకుని వైద్య పరీక్షలు నిర్వహించారు. రాజు అనే ఓ వృద్ధుడికి బీపీ చెక్ చేసి బీపీ నార్మల్.. షుగర్ నార్మల్ అంటూ చెప్పారు.
ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. ఆరోగ్యకరంగా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రశాంతంగా ఉంటూ వాకింగ్ చేసుకూంటూ మంచి పుడ్ తీంటూ. ప్రశాంతంగా ఆలోచించుకుంటూ ఉంటే ఎలాంటీ బిపి, షుగర్ వ్యాధీలు రావని ఈ సందర్భంగా సూచించారు.
డాక్టర్ కావాలనేది తన కోరిక అని, ముఖ్యంగా తన ఇంట్లో వాళ్ల కోరిక అని చెప్పారు. ఇంట్లో వారి కోసం డాక్టర్ అవుదామని అనుకున్నానని, పద్మావతి ఉమెన్స్ కాలేజీలో బైపీసీ స్టూడెంట్‌గా ఇంటర్ పాస్ అయ్యానని చెప్పారు. ఆ తర్వాత మెడికల్ సీటు కోసం ఎంట్రెన్స్ టెస్ట్ కూడా రాశానని రోజా చెప్పారు. అయితే తనకు సినిమాల్లో హీరోయిన్‌గా అవకాశం వచ్చిందని అలా సినిమాల్లోకి వెళ్లిపోయానని.. ఆ తర్వాత పాలిటిక్స్‌లోకి వచ్చానని అన్నారు. అలా వెళ్లిపోవడంతో డాక్టర్ కాలేకపోయానని చెప్పారు. ఆ సరదా ఈ రోజు తీర్చుకున్నాను అంటూ చెప్పుకొచ్చారు.
పుత్తూరు పరిసర ప్రాంత ప్రజలకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. శిబిరంలో సుమారు 200 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు చేసి, అవసరమైన వారికి మందులు, మాత్రలు పంపిణీ చేశారు. సుభాషిణి ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ శ్రీధర్, డాక్టర్ సుభాషిణి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
నారా వారి పాలన కాదు సారా వారి పాలన: ఎమ్మెల్యే రోజా