telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

బిజినెస్‌ ఎక్సలెన్స్‌ అవార్డు అందుకున్న .. మార్గదర్శి చిట్‌ ఫండ్‌ ఎండీ శైలజా కిరణ్‌ ..

margadarsi chits md got business excellence award

మార్గదర్శి చిట్‌ ఫండ్‌ ఎండీ శైలజా కిరణ్‌ చిట్‌ఫండ్‌ రంగాన్ని యజమానుల్లా కాకుండా సంరక్షకుల్లా నిర్వహించాలని అన్నారు. అఖిల భారత చిట్ ఫండ్ అసోసియేషన్ శైలజా కిరణ్‌ను బిజినెస్‌ ఎక్సలెన్స్‌ అవార్డుతో సత్కరించింది. చెన్నైలోని మద్రాస్‌ మేనేజ్‌మెంట్‌ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఆర్‌బీఐ పార్ట్‌టైం డైరెక్టర్‌ ఎస్‌ గురుమూర్తి ఈ అవార్డు ప్రదానం చేశారు. గత 57 ఏళ్లుగా దక్షిణాదిన నాణ్యమైన సేవలను అందిస్తున్న విశ్వసనీయమైన సంస్థగా మార్గదర్శి ప్రజల నమ్మకాన్ని చూరగొందని నిర్వాహకులు ప్రశంసించారు. శైలజా కిరణ్ నేతృత్వంలో మార్గదర్శి సంస్థ రూ.11,500 కోట్ల టర్నోవర్ సాధించిందని అసోసియేషన్‌ సభ్యులు కొనియాడారు.

అనంతరం శైలజా కిరణ్‌ మాట్లాడారు. సంప్రదాయ చిన్నమొత్తాల పొదుపు విధానంగా చిట్‌ ఫండ్‌ రంగాన్ని శైలజా కిరణ్‌ అభివర్ణించారు. 50 ఏళ్ల క్రితం బ్యాంకింగ్ రంగం వృద్ధి చెందుతున్న దశలో చిట్‌ఫండ్‌ రంగం దెబ్బతింటుందని భావించారని.. కానీ, అలా జరగలేదని అన్నారు. ఇప్పటికీ చిట్‌ఫండ్‌ వ్యాపారాలు బాగా నిర్వహిస్తున్నామని.. యువతను కూడా ఈ రంగంవైపు వచ్చేలా ప్రోత్సహించాలని కోరారు. చిట్‌ ఫండ్‌ రంగానికి గొప్ప భవిష్యత్‌ ఉందని శైలజా కిరణ్‌ అన్నారు.

Related posts