telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సమ్మె తీవ్రతరం చేస్తున్న ఆర్టీసీ కార్మికులు.. దిగివచ్చేది లేదంటున్న ప్రభుత్వం..

Tsrtc increase salaries double duty employees

ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు ద్రోహం చేయకుండా తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు ఆర్టీసీ కార్మికులతో కలిసి రావాలని ప్రజా సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరికి నిరసనగా అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు సలీం, బకరం శ్రీనివాస్, గురువయ్య, పందుల సైదులు, దుడుకు లక్ష్మీనారాయణ, అద్దంకి రవీందర్, ఇండ్లూరు సాగర్, దండెంపల్లి సత్తయ్య, ఐతగోని జనార్దన్‌గౌడ్, వీరా నాయక్, లింగయ్య, మానుపాటి భిక్షం, రాజు పాల్గొన్నారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మెను మరింత ఉధృతం చేయాలని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు అన్నారు. స్థానిక పీఆర్‌టీయూ భవన్‌లో ఆర్టీసీ కార్మికులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. సమ్మెలో ప్రత్యక్షంగా భాగస్వామ్యమై మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. అధికార పార్టీ నాయకులకు కార్మిక సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రాలు ఇవ్వాలని తీర్మానించారు. జిల్లా పరిషత్‌ సమావేశానికి వచ్చే అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కార్మికుల పక్షాన వినతి పత్రాలు ఇవ్వాలని, ఆ తర్వాత వారి నివాసాల వద్ద నిరసన కొనసాగించాలని నిర్ణయించారు. తాజాగా మరో ఆర్టీసీ కార్మికుడు గుండెపోటుతో మృతి చెందటంతో వారి కుటుంబం లో విషాదం చోటుచేసుకుంది.

Related posts