telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

స్టీల్‌ప్లాంట్‌పై మోడీ దగ్గరికి జగన్‌ పోతా… బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. అన్ని పార్టీలు ఒకే తాటిపైకి వచ్చి వైజాగ్‌లో దర్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే దీనిపై మోడీకి సీఎం జగన్‌ లేఖ కూడా రాశారు.
ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సరికాదని.. ప్రభుత్వ రంగ సంస్థలను గుడ్డిగా ప్రైవేటీకరణ చేయడాన్ని నేను వ్యతిరేకిస్తానని స్పష్టం చేశారు. ఎయిరిండియా ప్రైవేటీకరణనూ వ్యతిరేకించానని.. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంపై నాకు అవగాహన లేదు.. కానీ ప్రతీ దాన్ని ప్రైవేటీకరణ చేస్తామనే విధానం మంచిది కాదని కేంద్రానికి చురకలు అంటించారు. ప్రభుత్వం వ్యాపారం చేయొచ్చా లేదా అనే అంశంపై కేస్ బై కేస్ చూడాల్సి ఉంటుందని.. టీటీడీని అటానమస్ బాడీ చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. టీటీడీ అకౌంట్లను రాష్ట్ర ప్రభుత్వంతో కాకుండా కాగ్ తో ఆడిట్ చేయించాలన్న సీఎం నిర్ణయం చాలా మంచి పరిణామమని… టీటీడీని భక్తులే నడిపించేలా తీర్చిదిద్దాలని సూచించారు. పెట్రోల్, డిజీల్ ధరల పెరుగుదల ప్రజలకు భారంగా మారిందని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రధానిని కలిసేటప్పుడు తానూ సీఎం జగనుతో వెళ్తానని తెలిపారు. తెర వెనుక చంద్రబాబు ఉండి టీటీడీపై దుష్ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. 

Related posts