telugu navyamedia
రాజకీయ

సామాన్య ప్రజలకు మరో షాక్ : మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర

ఇప్ప‌టికే నిత్య‌వ‌స‌రాలు వ‌స్తువులు, డీజిల్, పెట్రోల్ ధరల పెరుగుదలతో సతమతమవుతోన్న సామాన్య ప్రజలకు మరో భారం వేసింది.

గృహ అవసరాల కోసం వాడుకునే డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరను మళ్లీ పెంచాయి.. 14.2 కేజీల సిలిండర్​ ధరను రూ.50 మేర పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి.

దేశ రాజ‌ధాని ఢిల్లీలో ప్రస్తుతం రూ.1003గా ఉన్న గ్యాస్ సిలిండర్ ధర తాజా పెంపుతో రూ.1053కు చేరుకుంది. హైదరాబాద్‌లో గ్యాస్‌ బండ ధర రూ.1055 నుంచి రూ.1105కు చేరింది. ముంబైలో సిలిండర్ ధర రూ.1,052.50, కోల్‌కతాలో రూ.1,079, చెన్నైలో రూ.1,068.50లకు చేరింది. పెంచిన గ్యాస్ ధరలు నేటి నుంచే అమలులోకి రానున్నట్లు తెలిపాయి.

సాధారణంగా ప్రతి నెల 1న వీటి ధరల్లో మార్పులు చేర్పులు ఉంటాయి. ఈ నెల 1న 19 కిలోల వాణిజ్య సిలిండర్‌ ధరను చమురు సంస్థలు ₹183.50 మేర తగ్గించాయి.

Related posts