telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పిల్లలకు ఆస్తులతో పాటు ఆరోగ్యాన్ని ఇవ్వడమే పెద్ద ఆస్తి: మంత్రి ఐకె రెడ్డి

indrakaran reddy

రేపటి పిల్లలకు ఆస్తులతో పాటు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడమే పెద్ద ఆస్తి అని తెలంగాణ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో రూ.2 కోట్ల‌తో చేప‌ట్టిన‌ మావ‌ల అర్బ‌న్ ఫారెస్ట్ పార్క్ అభివృద్ది ప‌నుల‌ను మంత్రి ప్రారంభించారు.ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ… భావి తరాలకు గాలి, నీరు, వర్షాలు, మంచి ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలంటే విరివిగా మొక్కలను నాటి పెంచాలన్నారు.

తెలంగాణ ప్ర‌భుత్వం చేప‌ట్టిన అట‌వీ ర‌క్ష‌ణ చ‌ర్య‌ల వ‌ల్ల విస్తృత చ‌ర్చ జ‌రిగి ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెరిగింద‌ని తెలిపారు. రాష్ట్రంలోని అడవులను కాపాడే విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పారు. నగరాలు, ప‌ట్ట‌ణాల్లో స్వచ్ఛమైన గాలి లభించడం గగనమైపోయింది, ఇలాంటి తరుణంలో తెలంగాణ ప్రభుత్వం ‘అర్బన్ లంగ్ స్పేస్’ పేరుతో రిజర్వు ఫారెస్టులను అభివృద్ధి చేస్తుందన్నారు.

Related posts