బీజేపీ పార్టీపై మరోసారి మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. అభివృద్ధి చేసేవాళ్లు కావాలో… బాంబులు వేసి కూలగొట్టేవాళ్లు కావాలో నిర్ణయించుకోవాలని ఓటర్లకు మంత్రి హారీష్ రావు సూచించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పటాన్ చెరు డివిజన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతోందని విమర్శించారు. సర్జికల్ స్ట్రైక్స్ అభివృద్ధి, నిరుద్యోగం, పేదరికం మీద చేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సర్జికల్ స్ట్రైక్స్ కి సంబంధం ఉందా అని మంత్రి ప్రశ్నించారు. బీజేపీ పార్టీ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోంటే.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చి కాపాడుతోందన్నారు. బీజేపీ పార్టీ చరిత్ర ప్రజలందరికీ తెలుసునని.. వారికీ తగిన బుద్ధి చెప్పాలని కోరారు. ప్రశాంత వాతావరణం ఉన్నప్పుడే పెట్టుబడులు పుష్కలంగా వస్తాయన్నారు మంత్రి హరీష్‌రావు. మతం పేరు తో బీజేపీ ప్రజల మధ్య విభజన రాజకీయాలకు తెర తీసిందని ఆయన మండిపడ్డారు.
previous post
next post
వ్యభిచారం తప్పుకాదు… శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు