telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సుశాంత్ కేసులో ఆధారాలు దొరక్కుండా 8 హార్డ్‌డిస్క్‌లు ధ్వంసం…!

Sushanth

యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో రియాకు సంబంధించి ఒక్కొక్కటిగా షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే రియాకు డ్రగ్స్ డీలర్లతో సంబంధాలు ఉన్నాయని పేర్కొంటూ, వాళ్ళతో ఆమె చేసిన వాట్సాప్ చాట్ వివరాలు సీబీఐకి అప్పగించింది ఈడీ. ఈ నేపథ్యంలో, డ్రగ్ డీలర్ గౌరవ్ ఆర్యతో రియా వాట్సాప్ చాటింగ్ చేసిందనే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ చాట్ ను తన ఫోన్ నుంచి రియా తొలగించినా… అధికారులు దాన్ని తిరిగి పొందారు. రియాకు, డ్రగ్స్ మాఫియాకు సంబంధాలు ఉన్నాయని నిర్ధారించుకున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆమెతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసింది. దీంతో ఆ కోణంలో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఇక సీబీఐ దర్యాప్తులో సుశాంత్ స్నేహితుడు సిద్ధార్థ్ పితాని చెప్పిన నిజాలు హాట్ టాపిక్ గా మారాయి. జూన్ 8న సుశాంత్‌తో రియా చక్రవర్తి గొడవపడిందని, గొడవ తర్వాత రియా వెళ్లిపోయిందని వాంగ్మూలం ఇచ్చాడు. మరోవైపు ఆధారాలు దొరక్కుండా 8 హార్డ్‌డిస్క్‌లు ధ్వంసం చేశారని సీబీఐ చెబుతోంది. జూన్ 8న సుశాంత్ నివాసంలోనే ఇదంతా జరిగినట్లు సీబీఐకి ఆధారాలు లభించాయి.

Related posts