“బాహుబలి” చిత్రం తర్వాత ప్రభాస్ నటిస్తున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం “సాహో”. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. నీల్ నితిన్ ముఖేశ్, ఎవ్లిన్ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ లాంటి బాలీవుడ్ స్టార్స్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. శంకర్ ఎహసాన్ లాయ్ తప్పుకున్న తర్వాత ఈ చిత్రానికి జిబ్రాన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్ 30న విడుదల కానుంది. “సాహో” చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, హిందీ, మళయాల భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఇక చిత్ర రిలీజ్ దగ్గర పడుతున్న క్రమంలో మేకర్స్ వినూత్నమైన ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పటికే సాహో చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియోస్‌తో పాటు పోస్టర్స్, సాంగ్స్ విడుదల చేశారు. వీటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇక ఈ సినిమాలో హీరోకు ధీటుగా ఉండే విలన్ పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముకేశ్ నటిస్తున్న విషయం తెలిసిందే. నేడు సినిమాలో ఆయన క్యారెక్టర్ ఫస్ట్ లుక్ ని కాసేపటి క్రితం “సాహో” చిత్రబృందం విడుదల చేసింది. నితిన్ ముకేశ్ న్యూ స్టైలిష్ లుక్ చూస్తే సినిమాలో ఆయన క్యారెక్టర్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికే పలు బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించిన నితిన్ ముఖేష్ ఈ సినిమాలో కూడా మరింత క్రూరమైన విలన్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇకపోతే ప్రముఖ కోలీవుడ్ నటుడు అరుణ్ విజయ్ కూడా ఈ సినిమాలో మరొక ముఖ్య పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
నాగశౌర్యను మెగా హీరోలు తోక్కేస్తున్నారు… హీరోయిన్ వ్యాఖ్యలు