జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేస్తామని బీజేపీ మేనిఫెస్టోలోనే చెప్పిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గుర్తు చేశారు. రాజ్యసభలో ఆమె మాట్లాడుతూ.. విస్తృత సంప్రదింపుల తర్వాతే ఆర్టికల్ 370 రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. జనసంఘ్ రోజుల నుంచే ఈ విషయంపై చర్చ జరుగుతోందని గుర్తుచేశారు.
జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి ఉండటం ఎన్నో పురోగామి చట్టాలకు అడ్డంకిగా మారిందని అన్నారు. ఎస్పీ, ఎస్టీ, మహిళలకు సమాన అవకాశాలకు ఆర్టికల్ 370 రద్దు తప్పనిసరని అన్నారు. జమ్ముకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం పరిధి పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)కూ వర్తిస్తుందని చెప్పారు. మరో వైపు ఈ ఆర్టికల్ రద్దు పై దేశవ్యాప్తంగా బీజీపీ, శివసేన, ఆర్ఎస్ఎస్ లు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.