telugu navyamedia
సినిమా వార్తలు

త్రిషకు మెగా ఆఫర్…?

trisha

ఒకప్పుడు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన త్రిష ప్ర‌స్తుతం తెలుగు సినిమాల‌కు దూరమైపోయింది. కానీ త్రిష‌ చివ‌రిగా న‌టించిన 96, పేట చిత్రాలు మంచి విజ‌యం సాధించ‌డంతో ఆమెకి కోలీవుడ్‌లో వ‌రుస ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం ఆమె కిట్టీలో అర‌డ‌జ‌నుకి పైగా ప్రాజెక్ట్‌లు ఉన్నాయ‌ని స‌మాచారం. మురుగ‌దాస్ శిష్యుడు శ‌ర‌వ‌ణ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో త్రిష ప్ర‌స్తుతం క్రేజీ ప్రాజెక్ట్ చేస్తుంది. ఈ చిత్రానికి ‘రాంగి’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ చిత్రం లేడీ ఓరియెంటెడ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతుంది. మ‌రోవైపు కె తిరుగ‌న‌న‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌ర‌మ‌ప‌దం విల‌య‌ట్టు అనే చిత్రం చేస్తుంది. ఈ చిత్రం త్రిష‌కి 60వ మూవీ కావ‌డం విశేషం. నంద‌, ఏఎల్ అజ‌గ‌ప్ప‌న్‌, వేల రామ్మూర్తి, రిచార్డ్‌, చామ్స్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు. 24 అవర్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేన‌ర్‌పై ఈ చిత్రం నిర్మితమ‌వుతుంది. అమ్రీష్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. కాగా… ఈ అమ్మ‌డు అతి త్వ‌ర‌లో మెగా హీరో ప్రాజెక్ట్‌తో టాలీవుడ్‌కి రీఎంట్రీ ఇస్తుంద‌ని అంటున్నారు. ఖైదీ నెంబ‌ర్ 150 చిత్రంతో వెండితెర రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి సినిమాల స్పీడ్ పెంచాడు. అక్టోబ‌ర్ 2న చిరు 151వ చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి భారీ స్థాయిలో విడుద‌ల కానుంది. తెలుగు, హిందీ, త‌మిళం, మ‌ల‌యాళం ఇలా ప‌లు భాష‌ల‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు. ఇక చిరు 152వ చిత్రం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నుండ‌గా, ఈ చిత్రానికి సంబంధించి కొన్నాళ్ళుగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జరుగుతున్నాయి. ఇందులో క‌థానాయిక‌గా అనుష్క, శృతి హాసన్, ఐశ్వ‌ర్య‌రాయ్,నయ‌న‌తార అంటూ ప‌లువురి పేర్లు ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. కాని తాజా స‌మాచారం ప్ర‌కారం త్రిష‌ని చిరు 152వ చిత్ర క‌థానాయిక‌గా ఫైన‌ల్ చేశార‌ట‌. ఇప్ప‌టికే ఆమెతో సంప్ర‌దింపులు కూడా చేశార‌నే టాక్స్ వినిపిస్తున్నాయి. ఈ వార్త‌లో ఎంత నిజం ఉందో చూడాలి మ‌రి.

Related posts