telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

సినీ తారలు కూడా .. ఇస్రోకి అండగా .. మరో గొప్ప అడుగుకు సిద్ధం అవ్వాలని ..

anubhav sinha support to isro

విక్రమ్ ల్యాండర్ నుంచి సిగ్నల్స్ కట్ అయిన నేపధ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలు నిరాశకు గురయ్యారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, సినీతారలు… శాస్త్రవేత్తల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. తమ ట్విట్టర్ ఖాతాల ద్వారా తమ స్పందనలు తెలియజేస్తున్నారు. ‘వెల్ డన్ ఇస్రో… మేము నిన్నుచూసి గర్వపడుతున్నాం అని బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ వ్యాఖ్యానించారు.

ఇస్రోకు కమ్యూనికేషన్ అందుతుందని భావిస్తున్నాం. ఇస్రో కృషికి వేలాదిమంది ప్రార్థనలు అండగా ఉన్నాయి. నమ్మకం ఉంచాలని అనుభవ్ సిన్హా అన్నారు. ‘మనం విజయం సాధిస్తాం. భవిష్యత్‌లో మన కలలన్నీ నెరవేరుతాయి. ఈ ప్రయోగంలో భాగస్వాములైన ఇస్రో టీమ్ దేశానికి గర్వకారణం’ అని రితేష్‌దేశ్‌ముఖ్ పేర్కొన్నారు. అలాగే తన భార్య జనీలియాతో కలసి ఈ ప్రయోగాన్ని వీక్షిస్తున్న ఫోటోను ఆయన షేర్ చేశారు.

Related posts