telugu navyamedia
సినిమా వార్తలు

“ఎన్టీఆర్ : మహానాయకుడు” కొత్త రిలీజ్ డేట్ 

NTR-Biopic
ఎన్టీఆర్ జీవితం ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో రెండు భాగాలుగా “ఎన్టీఆర్ బయోపిక్” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో ఆయన తనయుడు బాలకృష్ణ నటిస్తుండగా… “కథానాయకుడు”, “మహానాయకుడు” అనే టైటిల్స్ తో ఈ రెండు భాగాలు తెరకెక్కుతున్నాయి. మొదటి భాగమైన “కథానాయకుడు” చిత్రాన్ని జనవరి 9న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండవ భాగం “మహానాయకుడు”ను ముందుగా జనవరి 24న విడుదల చేయడానికి ముందుగా సన్నాహాలు చేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. అయితే ఇప్పుడు “మహానాయకుడు” విడుదల తేదీని మార్చారనేది తాజా సమాచారం. 
ఈ రెండు భాగాల మధ్య మరింత గ్యాప్ ఉంటే బాగుంటుందని భావించిన క్రిష్ సినిమాను ఫిబ్రవరి 14వ తేదీకి విడుదలను వాయిదా వేశారు. “మహానాయకుడు”లో ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం, ఆ ప్రయాణంలో ఆయనకి ఎదురైన పరిస్థితులను ప్రేక్షకులకు చూపించనున్నారు. రెండవ భాగంలో చంద్రబాబుగా రానా, హరికృష్ణగా కల్యాణ్ రామ్ పాత్రలు పూర్తిస్థాయిలో కన్పిస్తారు. అత్యధిక థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

Related posts