దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల క్రేజీ మల్టీస్టారర్ “ఆర్ఆర్ఆర్” నిర్మితమవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. రామ్ చరణ్ సరసన అలియా భట్, ఎన్టీఆర్ కు జతగా డైసీ ఎడ్గార్ అనే విదేశీ నటి నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో అజయ్ దేవగణ్, సంజయ్ దత్, వరుణ్ ధావన్ వంటి భారీ తారాగణం నటిస్తోంది. ప్రస్తుతం ఈ క్రేజీ మల్టీస్టారర్ మూవీ షూటింగ్ గుజరాత్‌లోని వడోదరాలో జరుగుతోంది. రామ్ చరణ్ కు గాయం కావడంతో ఈ షూటింగ్ ప్రస్తుతానికి వాయిదా పడిందనే విషయాన్ని స్వయంగా ఆర్ఆర్ఆర్ చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజాగా రామ్ చరణ్ ఈ విషయం గురించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ”ఆర్ఆర్ఆర్” షూటింగ్ చాలా బాగా జరుగుతోంది. కానీ దురదృష్టవశాత్తు కసరత్తు చేస్తుండగా… నా కాలి మడమ భాగంలో గాయమైంది. డాక్టర్లు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోమన్నారు. మరో మూడు వారాలలో షూటింగ్ లో పాల్గొంటాను” అని తెలిపారు. అంటే మరో మూడు వారాల వరకు సినిమా షూటింగ్ వాయిదా పడినట్లే
అది లేకపోతే..నగ్నంగా అనిపిస్తుందట!