telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

వారి కోసం ప్రత్యేక మాస్కులు తయారుచేసిన అమెరికా విద్యార్థిని…

ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వణికిస్తోంది. ఈ సమయంలో మాస్కుల ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోజు రోజుకు మాస్కులకు డిమాండ్ పెరుగుతూనే ఉంది. కొందరి నిర్లక్ష్యం కరోనా వ్యాప్తికి కారణమవుతోంది. ప్రజల నుంచి ప్రభుత్వాలు ముఖ్యంగా రెండు విషయాలు కోరుతోంది. ఒకటి సామాజిక దూరం పాటించడం.. రెండు మాస్కులు ధరించడం. ఇప్పుడు చాలా మంది సామాజిక దూరాన్ని బాగానే పాటిస్తున్నారు. కానీ మాస్కుల విషయంలో మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పట్లేదు. ప్రస్తుత మార్కెట్ లో కొన్ని మాస్క్ లు చూడటానికి వెరైటీగా ఉన్నాయి. ఇవి మూగ, చెవిటి వారికి ప్రత్యేకంగా డిజైన్ చేశారు. సాధారణ మాస్కులు వాడలేక, వాడినా ఆ ముసుగులో హావభావాలలను వ్యక్తీకరించలేక సతమతమవుతున్న మూగ, చెవిటి వారి కోసం అమెరికా విద్యార్థిని యాప్లే లారెన్స్ వీటిని తయారు చేసింది. ఈ మాస్క్ లకు నోటీ భాగంలో ప్లాస్టిక్‍ తొడుగు ఉంటుంది. ఫలితంగా పెదవుల కదలికల ఆధారంగా భాషను, భావవ్యక్తీకరణను ఎదుటివారు సలువుగా అర్థం చేసుకునేందుకు వీలు కలుగనుంది. ఈ మాస్క్ డిజైన్లపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.

Related posts