telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మున్సిపాలిటీలలో కూడా … భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ తప్పనిసరి.. : ఏపీసీఎం జగన్

cm jagan on govt school standardization

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మున్సిపాలిటీలో తప్పనిసరిగా భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి మురుగునీటి శుద్ధి, ఘన వ్యర్ధాల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తాగునీరు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, వ్యర్థాల తొలగింపు, మురుగునీటి శుద్ధి, పర్యావరణ పరిరక్షణ, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు కొనసాగుతున్న ప్రాజెక్టులు, చేపట్టాల్సిన కొత్త పనులపై సీఎం సమీక్షించారు.

తాగునీటి పైపులైన్లు డ్రైనేజీతో కలవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు. కృష్ణానది కట్టమీద, లోపల, కాల్వ గట్ల మీద ఉంటున్న వారికి ఇళ్ల నిర్మాణం కింద ఇప్పుడు ఇస్తున్న సెంటున్నర భూమి కాకుండా కనీసం 2 సెంట్ల విస్తీర్ణంలో కోరుకున్న చోట వారికి ఇళ్లు కట్టించి ఇవ్వాలని సీఎం జగన్ సూచించారు. తాడేపల్లి, మంగళగిరిలను ఆదర్శ మున్సిపాల్టీలుగా తయారు చేయాలని. తాడేపల్లి మున్సిపాల్టీలో 100 పడకల ఆస్పత్రికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశం జగన్ ఆదేశించారు. దీంతో మంగళగిరి ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు.

Related posts