telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

ఖైరతాబాద్ మెట్రో వద్ద వర్షపు నీరు.. వాహనాల దారి మళ్లింపు

traffic diverted due to ramzan

నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ లోని ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కింద రహదారిపై వర్షపు నీరు భారీగా నిలిచిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రధాన రహదారిపై నిలిచిన నీటిని తొలగించేందుకు ట్రాఫిక్ పోలీసులు వాహనాలను దారి మళ్లిస్తున్నారు.

అమీర్‌పేట్, కూకట్‌పల్లి వైపు వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలను సచివాలయం, ట్యాంక్‌బండ్ మీదుగా మళ్లిస్తున్నారు. మల్కాజ్‌గిరి ఎన్‌ఎండీసీ కాలనీలో మోకాలి లోతు వరద నీరు వచ్చి చేరింది. దీంతో ప్రజలు, రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంబులెన్స్‌కు ఫోన్ చేసినా వరద నీటిలో రాలేమని అధికారులు చెబుతున్నారని స్థానికులు వాపోయారు.

Related posts