telugu navyamedia
తెలంగాణ వార్తలు

దాసోలు, రాజ‌గోపాల్‌రెడ్డి చెప్పిన‌వి నిజాలు..ఆ ముగ్గురు కలిసి కుమ్మక్కైయ్యారు

*మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
*గాంధీభ‌వ‌న్‌కు స‌మాంత‌రంగా మ‌రో ఆఫీస్ న‌డుస్తోంది
*కోమ‌టిరెడ్డి వాద‌న‌ను తాను కూడా న‌మ్ముతున్నా
*మేం హోం గార్డుల్లా క‌నిపిస్తున్నామా
*దాసోలు, రాజ‌గోపాల్‌రెడ్డి చెప్పిన‌వి నిజాలు

గాంధీభవన్‌ కు సమాంతరంగా మరో ఆఫీస్‌ నడుస్తోందంటూ ఆ పార్టీ నేత మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు

బుధవారం మీడియాతో మర్రి శశిధర్‌ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో కల్లోలానికి కారణం రేవంత్‌ రెడ్డి అని అన్నారు. రేవంత్‌ కాంగ్రెస్‌కు నష్టం చేసే పనులు చేస్తున్నార‌ని ఆరోపించారు.

పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్యం ఠాగూర్…రేవంత్ ఏజెంట్ గా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. డబ్బులతో పీసీసీ కొన్నారన్న కోమటిరెడ్డి వాదనను నమ్ముతున్నట్లు తెలిపారు. తాము హోమ్‌గార్డుల్లాగా కనిపిస్తున్నామా అని ప్రశ్నించారు.

దాసోజు శ్రవణ్‌ , రాజగోపాల్‌రెడ్డి చెప్పినవి నిజాలని స్పష్టం చేశారు. ముగ్గురు కలిసి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ హైకమాండ్‌కు తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారని తెలిపారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పై అలా మాట్లాడడం సరికాదని మర్రి శిశిధర్‌రెడ్డి అన్నారు.

కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న సీనియర్లను పండబెట్టి తొక్కుతా…గోడకేసి కొడతా అంటే కూడా అధిష్టానం మందలించకపోవటం సరికాదన్నారుకోమటిరెడ్డి బ్రదర్స్‌ విషయంలో రేవంత్‌ తీరు సరిగాలేదు. నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

పీసీసీ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి ఎన్నికైన నాటి నుంచే సీనియర్లు అంత అసంతృప్తిగా ఉన్నారు. ఆయన లెక్కలేని తనం కారణంగా చాలా మంది పార్టీని వీడుతున్నార‌ని అన్నారు.

Related posts