telugu navyamedia
సినిమా వార్తలు

రూ.215 కోట్ల మనీ లాండరింగ్ కేసులో నిందితురాలిగా జాక్వెలిన్..

మనీ లాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ చుట్టూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాక్ ఇచ్చింది.

Jacqueline Fernandez joins the sequin saree bandwagon and it is perfect for you to wear for your sangeet | PINKVILLA

ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్‌ ప్రధాన నిందితుడిగా ఉన్న రూ.200 కోట్ల దోపిడీ కేసులో జాక్వెలిన్‌ను ఈడీ నిందితురాలిగా పరిగణించింది. ఈ మేరకు జాక్వెలిన్‌ పేరును ఢీల్లీ కోర్టుకు సమర్పించిన స‌ప్లిమెంట‌రీ ఛార్జ్‌షీట్‌లో చేరుస్తూ..ఆమె పేరును నిందితురాలిగా పేర్కొంది.

Jacqueline Fernandez named in chargesheet filed by ED in Sukesh Chandrasekhar's money laundering case; Report | PINKVILLA

రాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లను రూ.200 కోట్లకు మోసం చేసిన కేసులో సుకేశ్‌ చంద్రశేఖర్‌ ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. సుకేశ్ చంద్రశేఖర్‌ దోపిడీదారు అని జాక్వెలిన్‌కు ముందే తెలుసని, అయినప్పటికీ అతడితో స‌న్నిహిత సంబంధాలు కొనసాగించింద‌ని ఈడీ విచారణలో తేలింది.

Jacqueline Fernandez (aka) Jacqueline photos stills & images

అతడు ఇప్పటివరకు పొందిన నగదులో ఆమెకు భాగం ఉన్నట్లు గుర్తించారు. వీడియో కాల్స్ ద్వారా అతనితో జాక్వెలిన్ నిరంతరం టచ్‏లో ఉన్నట్లు కీలక సాక్షులు వాంగ్మూలాలు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.

ed names jacqueline fernandez as accused in rs 215 crore extortion case will file chargesheet today SEXI News | SEXI News

మరోవైపు ..అతని నుంచి ఖరీదైన బహుమతులను పొందినట్లు కూడా గుర్తించారు. ఇప్పటికే మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ ఇప్పటివరకు ఆమెకు సంబంధించిన రూ. 7 కోట్లకు పైగా విలువైన ఆస్తులను అటాచ్ చేసింది.

I am calling from Amit Shah's office': How conman Sukesh befriended Jacqueline - India News

అత్యంత ఖరీదైన డిజైనర్‌ బ్యాగులు, జిమ్‌ సూట్లు, వజ్రాల చెవిపోగులు, బ్రాస్‌లెట్‌, మినీ కూపర్‌.. ఇలా దాదాపు రూ.10కోట్ల విలువైన కానుకలను జాక్వెలిన్‌, ఆమె కుటుంబసభ్యులకు సుకేశ్ ఇచ్చినట్లు ఈడీ దర్యాప్తులో గుర్తించింది.

Jacqueline Fernandez appears at the ED office in Delhi; questioned in Rs  200 crore extortion case | Hindi Movie News - Times of India

సుకేశ్‌తో నటికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఈడీ విచారణలో తేలినట్లు సమాచారం. గతంలో వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫొటోలు కూడా సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి.

దీంతో ఈ కేసు విచారణ నిమిత్తం ఈడీ పలుమార్లు ఆమెకు సమన్లు జారీ చేసింది. ఆ మధ్య జాక్వెలిన్ విదేశాలకు వెళ్లకుండా లుక్‌అవుట్‌ నోటీసులు కూడా జారీ చేసింది. అయితే దీనిపై ఆమె కోర్టుకు వెళ్లగా.. విదేశాలకు వెళ్లేందుకు న్యాయస్థానం అనుమతినిచ్చింది.

I gave gifts to Jacqueline Fernandez, she is not involved in money laundering: Sukesh Chandrasekar | Delhi News

కాగా..రాన్​బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్​ సింగ్​, శివిందర్​ సింగ్​కు బెయిల్​ ఇప్పిస్తానని నమ్మించి వారి భార్యల దగ్గర నుంచి ఏకంగా రూ.200 కోట్లు వసూలు చేశాడు సుకేశ్​చంద్రశేఖర్​. తర్వాత బెయిల్‌ విషయాన్ని దాటవేస్తుండటంతో.. శివిందర్​ సింగ్​ భార్య అదితి సింగ్​ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన దిల్లీ పోలీసులు 2021లో సుకేశ్‌ను అరెస్టు చేశారు.

 

Related posts