నేనే రాజు నేనే మంత్రి, ఇద్దరమ్మాయిలతో, సరైనోడు వంటి చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కేథరిన్ ట్రెసా. తెలుగులో చాలా చిత్రాల్లో నటించినా ఇప్పటి వరకు సరైన గుర్తింపు లభించలేదు. మరోవైపు కోలీవుడ్‌లో మాత్రం చేతినిండా సినిమాలతో స్టార్ హీరోయిన్ ఇమేజ్‌ను దక్కించుకున్నారు. అయితే… తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా తనదైన గుర్తింపును తెచ్చుకుంది కేథరిన్. విజయ్ దేవరకొండ సరసన ‘వరల్డ్ ఫేమస్ లవర్’లో చివరిసారిగా నటించిన కేథరిన్ మరో తెలుగు సినిమాను తన కిట్ లో వేసుకుంది. శ్రీవిష్ణు హీరోగా సాయి కొర్రపాటి నిర్మించబోతున్న సినిమాలో కేథరిన్ జర్నలిస్ట్ పాత్రను పోషించబోతోందట. ‘బాణం, బసంతి’ చిత్రాల ఫేమ్ చైతన్య దంతులూరి ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నాడు.
previous post