telugu navyamedia
సినిమా వార్తలు

షణ్ముఖ ప్రియకు ఇచ్చినమాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ

‘ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌ 12’లో ఫైనల్స్ కి చేరిన తెలుగమ్మాయి షణ్ముక ప్రియకు రౌడీ హీరో విజయ్ దేరకొండ తన సినిమాలో పాడే అవకాశం ఇస్తానని హామీ ఇచ్చాడు. ఆ మాటని విజయ్‌ దేవరకొండ నిలబెట్టుకున్నారు. ఆయన హీరోగా నటిస్తోన్న ‘లైగర్‌’ చిత్రంలో ఆమెతో ఓ పాట పాడించారు. తాజాగా ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా తెలియజేశారు. షణ్ముఖ ప్రియని కలిసి, ఆమెతో ముచ్చటించిన దృశ్యాల్ని అభిమానులతో పంచుకున్నారు. ‘విజయ్‌ దేవరకొండకి నేను అభిమానిని.

అలాంటి ఆయన నా గురించి మాట్లాడతారని, నాకు మద్దతిస్తారని ఎప్పుడూ ఊహించలేదు. ఇది నేను నమ్మలేకపోతున్నా’ అని విజయ్‌ని కలవకముందు షణ్ముఖప్రియ మనసులోని మాట ఇది. ఈ విషయాన్నే ఇప్పుడు విజయ్‌ షేర్‌ చేసిన వీడియోలో చూపించారు. త్వరలోనే షణ్ముఖ ఆలపించిన గీతాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. షణ్ముఖగానం విజయ్‌ని విశేషంగా ఆకట్టుకోవడంతో ‘‘ఇండియన్‌ ఐడల్‌’ లో నువ్వు ఓడినా, గెలిచినా హైదరాబాద్‌ వచ్చాక మనం కలుస్తాం.

నువ్వు నా సినిమాలో పాడతావ్‌. ఇది డీల్‌’ అంటూ గతంలో ఓ వీడియో పోస్ట్‌ చేశారు. ఇప్పుడు ఆ వాగ్ధానం నెరవేర్చారు. విజయ్‌ దేవరకొండ హీరోగా పాన్‌ ఇండియా స్థాయిలో పూరీ జగన్నాథ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘లైగర్‌’. అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తున్నారు. రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ధర్మ ప్రొడక్షన్స్‌, పూరీ కనెక్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Related posts