telugu navyamedia
సినిమా వార్తలు

నితిన్‌ ‘మాస్ట్రో’ న్యూ సాంగ్ రిలీజ్‌..

సూపర్ హిట్ మూవీ ‘అంధాధూన్’ తెలుగు రీమేక్‌‌గా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘మాస్ట్రో’ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నితిన్ హీరో తెరకెక్కుతోన్న సినిమా ‘మాస్ట్రో’. నభానటేశ్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో తమన్నా కీలక పాత్రలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు.

వాస్తవానికి ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలని చిత్ర యూనిట్‌ చివరి క్షణం వరకు భావించింది. కానీ కరోనా పరిస్థితుల నేపథ్యం లో థియేటర్లు మూతపడడంతో మేకర్స్‌ సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.

Nithin Maestro: నితిన్‌ 'మాస్ట్రో' నుంచి కొత్త సాంగ్ వచ్చేసింది... ఆకట్టుకుంటోన్న లిరిక్స్‌.

ఇటీవలే విడుదల చేసిన ట్రైలర్‌ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. ఇదిలా ఉంటే సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో ప్రచారంలో వేగం పెంచిన సినిమా యూనిట్‌ తాజాగా సినిమాకు సంబంధించి మరో పాటను విడుదల చేసింది. ‘లా లా లా’ అని సాగే ఈ పాటలోని లిరిక్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. స్వర సాగర్‌ మహాతి పాటను పాడిన తీరు బాగా ఆక‌ట్టుకుంటుంది.

Baby O Baby Lyrics - Maestro | Anurag Kulkarni | Telugu Song Lyrics

నితిన్ సొంత నిర్మాణ సంస్థ ‘శ్రేష్ఠ్ మూవీస్’ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నిఖితా రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. చిత్రంలో నితిన్ అంధుడిగా కనిపించనుండటం విశేషం. . ఈ సినిమా సెప్టెంబర్ 17 నుంచి డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related posts