telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సమంతను పోలిన మరో బ్యూటీ…!?

Aathmika

మ‌నిషిని పోలిన‌ మ‌నుషులు ఏడుగురు ఉంటారని పెద్దలు చెప్పడం వింటూనే ఉంటాం. ఇప్పటికే పలువురు సెలెబ్రిటీలను పోలి ఉన్న మనుషులను సోషల్ మీడియా పుణ్యమాని చూశాం కూడా. అయితే టాలీవుడ్ టాప్ హీరోయిన్‌ల‌లో ఒక‌రిగా ఉన్న స‌మంత మాదిరి అషూ రెడ్డి ఉంద‌ని అప్ప‌ట్లో తెగ వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేశాయి. స‌మంత డూప్‌గా ప్రాచుర్యం పొందిన ఈ అమ్మ‌డు బిగ్ బాస్ సీజ‌న్ 3కి కూడా ఎంపికైంది. ఇక ఇప్పుడు త‌మిళ ప‌రిశ్ర‌మ‌కి చెందిన వ‌ర్ధ‌మాన న‌టి ఆత్మిక కూడా స‌మంత‌లానే ఉంద‌ని అంటున్నారు. ఓ ఫోటో షూట్‌లో పాల్గొన్న ఈ అమ్మ‌డి ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో అచ్చం స‌మంత‌లానే ఉంది కదా అని కామెంట్ పెడుతున్నారు. కాగా స‌మంత రీసెంట్‌గా “జాను” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Related posts