లేడీ సూపర్‌స్టార్ నయనతార, తన ప్రియుడు విఘ్నేశ్ శివన్ మరో నాలుగు రోజుల్లో ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు.
సుమారు ఏడేళ్ల నుంచి నయన్-విఘ్నేశ్ ప్రేమలో ఉన్నారు. కుటుంబసభ్యుల సమక్షంలో గతేడాది ఈ జంట నిశ్చితార్థం జరిగింది. మహాబలిపురంలోని మహబ్ హోటల్‌లో జూన్ 9న ఈ పెళ్లి జరగనుంది.
దీంతో నయనతార, విఘ్నేశ్ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. పెళ్లి షాపింగ్ దగ్గర నుంచి , ఆహ్వానపత్రికలు పంపడం వరకు నయనతారనే చూసుకుంటుంది. ఇప్పటికే కొందరు అతిథులకు ‘డిజిటల్ వీడియో ఇన్విటేషన్ కార్డ్’ని పంపించారు ఈ జంట.
తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆయన కుమారుడు హీరో, నిర్మాత ఉదయనిధి స్టాలిన్‌ను ప్రత్యేకంగా కలిసి తమ వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. పెళ్లికి తప్పకుండా హాజరు కావాల్సిందిగా కోరారు. సీఎం వీరిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.ఇందుకు సంబంధించిన ఫోటోలో సోషల్ మీడియోలో వైరల్ అవుతున్నాయి.
ఇక, సినిమాల విషయానికి వస్తే నయన్ కథానాయికగా నటించిన ‘కాతువక్కల రెందు కాదల్’ చిత్రానికి విఘ్నేశ్ దర్శకత్వం వహించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం నయన్.. చిరుతో ‘గాడ్ ఫాదర్’, పృథ్వీరాజ్ సుకుమారన్‌తో ‘గోల్డ్’, షారుఖ్ ఖాన్‌తో ‘జవాన్’.. అలాగే కోలీవుడ్‌లో ‘ఓ 2’, ‘కనెక్ట్’ చిత్రాలు చేస్తున్నారు.
‘